Salman Khan: సల్మాన్ ఖాన్ అందుకే పెళ్లి చేసుకోలేదు.. సల్మాన్ తండ్రి ఏం చెప్పారంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సల్మాన్ ఖాన్ కు (Salman Khan) పేరుంది. సల్మాన్ ఖాన్ వయస్సు ప్రస్తుతం 58 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ హీరో పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు. అయితే సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ( Salim Khan) చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ ఎవరినైనా త్వరగా ఇష్టపడతారని అయితే పెళ్లి చేసుకునే ధైర్యం మాత్రం అతనికి లేదని సల్మాన్ సింపుల్ గా ఉంటాడు కాబట్టి అందరికీ నచ్చుతాడని ఆయన పేర్కొన్నారు.

తన లైఫ్ లోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా లేదా అని సల్మాన్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడని తన తల్లిలాంటి లక్షణాలున్న అమ్మాయిని సల్మాన్ వెతుకుతుంటాడని సలీమ్ ఖాన్ అన్నారు. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి సైతం తన తల్లిలా భర్త, పిల్లలకు అంకితం కావాలని కోరుకుంటాడని ఆయన తెలిపారు. తనకు కాబోయే భార్య వంట పని, ఇంటి పని చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని అనుకుంటాడని సలీమ్ ఖాన్ వెల్లడించారు.

ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండటం సులువు కాదని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు ఎవరినీ పెళ్లి చేసుకోలేదని సలీమ్ పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ సైతం ఒక సందర్భంలో నా లైఫ్ లోకి సరైన వ్యక్తి వచ్చిన సమయంలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నా మాజీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మంచివాళ్లే అని వాళ్ల వైపు నుంచి తప్పు లేదని నేను వాళ్లను సరిగ్గా చూసుకోలేనేమో అనే భయంతో బ్రేకప్ చెప్పి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. నా ప్రేమ కథలన్నీ నాతో పాటే సమాధి అవుతాయని సల్మాన్ ఖాన్ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus