Salman Khan: క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి సల్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

క్యాస్టింగ్‌ కౌచ్‌.. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా అన్ని చోట్లా వినిపించే ఓ నైట్‌మేర్‌ లాంటి పదం ఇది. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం అనేది ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే పదానికి అర్థం. దీని కారణంగా ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనమైపోయాయి అని చెబుతుంటారు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిలు ప్రజల ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇటీవల దీని గురించి సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడింది వేరు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

సల్మాన్‌ ఖాన్‌లో మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంటుంది. బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ చేస్తున్నప్పటి నుండి అది ఇంకా పెరిగింది. ఈ క్రమంలో తనదైన శైలిలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై కామెంట్లు చేశాడు సల్లూ భాయ్‌. శనివారం ముంబయిలో జరిగిన ‘గాడ్ ఫాదర్’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సల్మాన్‌ జోకులు వేసి చాలా సరదాగా కనిపించాడు. చిరంజీవిపై కూడా కొన్ని సరదా పంచ్‌లు వేయడం గమనార్హం. అలాంటి సమయంలో మీడియా నుండి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై అభిప్రాయం చెప్పండి అడిగితే..

సల్మాన్‌ గతంలో జరిగిన ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. ‘‘సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని అంటుంటారు? కానీ వాళ్లు చెప్పేది తప్పు, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను, చిరంజీవి గతంలో ఓసారి థాయిలాండ్‌లో యాడ్ చేశాం. అక్కడి నుండి ఇద్దరం కలిసి ముంబయి వచ్చాం. అప్పటికే రాత్రి 1.30 అయ్యింది. ఉదయాన్నే చిరంజీవి విమానంలో హైదరాబాద్ వెళ్లాలి. కాసేపు మాట్లాడుకున్నాక.. బెడ్‌రూంలోకి వెళ్లి పడుకోమని చిరుకి చెప్పాను.

దానికి ఆయన నా కౌచ్‌లోనే పడుకుంటానని అన్నారు. కాసేపు మాట్లాడుకుని నా కౌచ్‌లోనే నిద్రపోయాం. ఉదయం విమానంలో చిరంజీవి హైదరాబాద్ వెళ్లిపోయారు’’ అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్‌. అలా నేను కాకుండా నా కౌచ్‌లో నిద్రపోయిన ఏకైక వ్యక్తి చిరంజీవి. అలా అక్కడ క్యాస్టింగ్ కౌచ్ జరిగింది. ఆ రోజు మా మధ్య అలా జరిగింది కాబట్టే, ఇప్పుడు ఇలా నేను ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో నటించాను’’ అని సల్మాన్‌ అన్నాడు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus