Salman Khan: విజయ్ సినిమాపై ఫోకస్ పెట్టిన సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఒరిజినల్ కథల కంటే కూడా రీమేక్ సినిమాలతోనే తన మార్కెట్ ను పెంచుకుంటూ వచ్చాడు. వరుసగా డిజాస్టర్ సినిమాలు ఎదురైన సమయంలో ఆయనను సేవ్ చేసిన సినిమాల్లో కిక్, పోకిరి రీమేక్స్ కూడా ముఖ్యమైనవి. కేవలం ఇప్పుడనే కాదు 90ల కాలం నుంచే సల్మాన్ సౌత్ సినిమాలు నచ్చితే వెంటనే హిందీలో రీమేక్ చేస్తూ వచ్చాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే గత కొన్ని నెలలుగా సల్మాన్ ఖాన్ కోలీవుడ్ హిట్ మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు. విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ మూవీ. ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ పై సల్మాన్ మనసు పారేసుకున్నాడట. మెయిన్ స్టోరీ లైన్ తీసుకొని హిందీ అడియెన్స్ వాతావరణానికి తగ్గట్లుగా తెరకెక్కిస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో హిట్టవుతుందని ఫిక్స్ అయ్యారట. సల్మాన్ అయితే సినిమాను రీమేక్ చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాస్టర్ నిర్మాతలతో హిందీ రైట్స్ కోసం చర్చలు మొదలు పెట్టినట్లు టాక్ అయితే వస్తోంది.

ఇక రీసెంట్ గా సల్మాన్ ఖాన్ రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఓటీటీ లో పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయగా మొదటి ఆటకే ఊహించని రేంజ్ లో డిజాస్టర్ టాక్ ను అందుకుంది. సినిమా ప్లాప్ టాక్ ను అందుకున్నా కూడా పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కివ ధరకు అమ్మడంతో నిర్మాత సేఫ్ అయ్యాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus