Salman Khan: సల్మాన్ ఖాన్ ఇల్లు అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!

ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న హీరోలలో సల్మాన్ ఒకరు. అలాగే భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో ఆయన ఒకరు. సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల తనకున్న అపార్ట్మెంట్ లలో ఒకదానిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నివేదికల ప్రకారం, సల్మాన్ ఖాన్ ముంబైలోని శాంతాక్రజ్‌లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీలో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. అద్దె ఒప్పందం ఆగస్టు నుండి 60 నెలల కాలవ్యవధికి సెట్ చేయబడింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం,భవనంలోని కింది అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు.. రెండవ అంతస్తులను కలిగి ఉంటుంది. నివేదికల ప్రకారం మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ. 1 కోటికి చేరుకుంటుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షలకు పెరుగుతుందని అంచనా.

మూడవ సంవత్సరం రూ. 1.05 కోట్లు, నాలుగు మరియు ఐదవ సంవత్సరానికి వరుసగా రూ. 1.10 కోట్లు, రూ. 1.15 కోట్లు. సల్మాన్ ఖాన్ (Salman Khan) ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని శివ్ అస్థాన్ హైట్స్‌లో నెలకు రూ. 95,000 చొప్పున మరో అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చాడని సమాచారం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus