ఎంతైనా.. తెలుగు హీరోలే గ్రేటురా! ‘సీటీమార్’ హిందీ పాట చూశాక చాలామంది అభిమానులు అనుకున్న, అనుకుంటున్న మాట ఇది. కారణం ఆ పాటలో హీరోలు వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్. తెలుగు ‘సీటీమార్’లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు, హిందీ పాటలో సల్మాన్ ఖాన్ వేసిన స్టెప్పులను ఇప్పుడు అభిమానులు, సినిమా జనాలు బేరీజు వేసి చూసుకుంటున్నారు. బాలీవుడ్‘సీటీమార్’లో ఏదో మ్యాజిక్ మిస్ అయ్యింది అనుకుంటున్నారు. అదే ‘గ్రేస్’. మామూలుగా సల్మాన్ అంటే చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయ్యింది.
ఒక హిట్ సాంగ్‌ను రీమేక్ చేయడం అంత సులభం కాదు. ఇన్నాళ్లూ తెలుగు – తెలుగు రీమేక్ గురించి మనం ఈ మాటలు విన్నాం. అయితే తొలిసారి తెలుగు – హిందీ రీమేక్ గురించి ఈ మాట వినిపిస్తోంది. హిందీ ‘సీటీమార్’ పాటలో సల్మాన్ ఆ ఊపుకు తగ్గట్టు డ్యాన్స్ వేయలేకపోయాడు అనేది ఒక్కసారి పాట చూసినా తెలిసిపోతుంది. సీటీమార్ అనే పదం వచ్చి… విజిల్ వేస్తున్నట్లుగా ఒక స్టెప్ రూపొందించారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అది చూడటానికి ఏమాత్రం బాగాలేదు. మాస్టర్ అలా ఇచ్చారా.. భాయ్ అలా చేశాడా అనేది తెలియదు.
ఇక పాటలో హైలైట్ స్టెప్ ఏంటి అంటే టీషర్ట్‌ను ముఖానికి కప్పుకొని, ప్యాంట్‌ను చుట్టూ చేతులు పెట్టి వేసే స్టెప్. ఈ సిగ్నేచర్ మూమెంట్ను పాటలో రెండుసార్లు పెట్టారు. రెండుసార్లూ హిట్టే. ఈ స్టెప్ మినహా మిగిలిన స్టెప్పులన్నీ సోసోగా ఉన్నాయి. దీంతో బన్నీ ముందు భాయ్ తేలిపోయాడు అనిపించింది. ఆ ప్యాంట్ స్టెప్ లేకపోయుంటే పాట ఇంకా నాసిరకంగా వచ్చేదేమో. భాయ్ మా పాట తీసుకెళ్తే తీసుకెళ్లావ్.. కొంచెం నీ పాత గ్రేస్ కూడా చూపించు భాయ్.
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!