Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ టీమ్‌ పనుల వేగం పెంచేసింది!

సల్మాన్‌ ఖాన్‌ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటింబోతున్న విషయం తెలిసిందే. దీని కోసం సల్మాన్‌ ఖాన్‌ సిద్ధమైపోతున్నాడు. షూటింగ్‌కి అంతా సిద్ధం చేసుకోండి అంటూ చిరంజీవికి సమాచారం ఇచ్చాడట. దీంతో ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌ ఇప్పుడు సినిమా షూటింగ్‌ కోసం ప్లాన్స్‌ వేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరిలో ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా సమాచారం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మలయాళంలో ఘన విజయం సాధించిన మోహన్‌ లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’ అనే సినిమాకు ‘గాడ్‌ఫాదర్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మాతృకలో ఆ చిత్ర దర్శకుడు అయిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన విషయం తెలిసిందే. సినిమాలో కీలక సమయలో ఈ పాత్ర ఎంటర్‌ అయ్యి… సినిమా పేస్‌ను అమాంతం పెంచుతుంది. దాంతో పాటు హీరోయిక్‌గా భలేగా ఉంటుంది. ఆ పాత్రనే తెలుగులో సల్మాన్‌ ఖాన్‌ పోషిస్తున్నారట. దీనిపై చిత్రబృందం అఫీషియల్‌గా సమాచారం ఇవ్వకపోయినా, మొన్నా మధ్య హైదరాబాద్‌ వచ్చినప్పుడు సల్మాన్‌ చెప్పేశాడు.

మాతృక ప్రకారం చూసుకుంటే… మోహన్‌లాల్‌కు మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్ర ఉంటుంది. మరి తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్రను ఎలా చూపిస్తారు అనేది చూడాలి. ఎలా చూపించినా తెలుగు తెరపై సల్మాన్‌ అప్పీయరెన్స్‌ మామూలుగా అయితే ఉండదు అని చెప్పేయొచ్చు. ‘గాడ్‌ ఫాదర్‌’ కోసం ఎంతమంది వెయిట్‌ చేస్తున్నారో, సల్మాన్‌ కోసం ఇంకా ఎక్కువమంది వెయిట్‌ చేస్తున్నారు అని చెప్పొచ్చు. మరి దర్శకుడు మోహన్‌రాజా ఆ పాత్రను ఎంత హీరోయిక్‌గా చూపిస్తారు అనేది చూడాలి.

ఈ సినిమాతో పాటు వెంకటేశ్‌తో మరో సినిమాలోనూ నటిస్తున్నానని సల్మాన్‌ ఆ రోజు చెప్పాడు. అయితే ఆ సినిమా ఏంటి అనేది చెప్పలేదు. ఇక్కడకు వచ్చినప్పుడు మనకు ఏవైనా అదనపు వివరాలు తెలుస్తాయేమో చూడాలి. సల్మాన్‌ ఖాన్‌ వచ్చేలోపు ఇక్కడ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా ఉంటారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అంటే ఫిబ్రవరి రెండో వారంలో సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్‌ ఉండొచ్చని తెలుస్తోంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus