RRR Event: అందుకోసమైనా సల్మాన్ రావాల్సిందే!

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముందుగానే సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసుకుని ఒక నెల రోజుల ముందు నుంచే ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో బిజీ అయ్యారు. రాజమౌళి ప్లాన్ గురించి అందరికీ తెలిసిన విషయమే.

కేవలం ఒక్క భాషలోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు అనేది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా ప్రత్యేకంగా ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నిర్మాత డి.వి.వి.దానయ్య రాజమౌళి తనయుడు కార్తికేయ ఇద్దరూ కూడా ఇందుకోసం ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఆ వేడుక కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ కు ముందు నుంచి మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఇక మెగాఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. ఉపాసన కొణిదెల కుటుంబంతో కూడా ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకోసం అయినా కూడా సల్మాన్ ఖాన్ ఈవెంట్ కోసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రాజమౌళి లాంటి దర్శకుడితో కూడా పరిచయాలు పెంచుకుంటే బాగుంటుంది అనే విషయంలో సల్మాన్ ఖాన్ ఆలోచిస్తాడు అని చెప్పవచ్చు. ఇక సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందట. అంతే కాకుండా వేడుకలో కరణ్ ప్రత్యేకంగా హోస్ట్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus