Salman Khan, Atlee: సల్మాన్‌ ఖాన్‌ నెక్స్ట్‌ఏంటి? అట్లీ సినిమా ఓకే అయ్యిందా? లేదా?

‘జవాన్‌’ (Jawan) సినిమా తర్వాత అట్లీ ఎవరితో సినిమా చేస్తారు అనే చర్చ గత కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇద్దరు హీరోల పేర్లు వినిపించాయి. అందులో ఒకటి సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) కాగా, మరొకటి అల్లు అర్జున్‌(Allu Arjun) . అందులో ఎక్కువగా బన్నీ పేరే వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఫైనల్‌ అవ్వలేదని, అట్లీ (Atlee) మరో హీరో వేటలో ఉన్నారు అని టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో మరి సల్మాన్‌ సంగతేంటి అనే ప్రశ్న ఉదయించింది.

దక్షిణాది సినిమా పరిశ్రమలో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ బాలీవుడ్ వెళ్లి అక్కడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి అక్కడి స్టార్‌ హీరోల దృష్టిలో పడ్డారు. సరైన విజయం కోసం ఎదురుచూస్తూ, ఓ మంచి హిట్‌ కొట్టిన ఊపులో ఉన్న షా రుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా ‘జవాన్’ తెరకెక్కించి ఫుల్ మార్క్స్ కొట్టేశారు. అప్పుడు నెక్స్ట్‌ సినిమా సల్మాన్‌ ఖాన్‌తో అనేశారు. అయితే బన్నీ సినిమా కోసం అట్లీ మళ్లీ సౌత్‌కి వచ్చేశారని టాక్ నడిచింది.

అయితే, ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’  (Pushpa 2: The Rule) సినిమా డిసెంబరుకు వాయిదా పడటంతో అట్లీ సినిమా ఇప్పట్లో లేదని తేలిపోయింది. ఈ క్రమంలో సల్మాన్‌ ప్రాజెక్టును అట్లీ ముందుకు తీసుకెళ్తాడనే చర్చ మొదలైంది. కథ రెడీ అని, త్వరలో షూటింగ్‌ ప్రారంభం అని కూడా అనేశారు. దీనితో బాలీవుడ్‌లో అట్లీ మరొకసారి సంచలనం సృష్టించనున్నారని అంచనాలు మొదలుపెట్టేశారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ కూడా లేదంటున్నారు ఇప్పుడు.

సల్మాన్ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ, సల్మాన్ కాంబో వార్తలు నిజం కావని, రూమర్స్‌ నమ్మొద్దని చెప్పారు. సల్మాన్‌తో త్వరలో ‘దబంగ్‌ 4’ స్టార్ట్‌ చేస్తున్నామని కూడా చెప్పారు. ప్రస్తుతం మురుగదాస్‌తో (AR Murugadoss) చేస్తున్న ‘సికిందర్‌’ అయ్యాక ‘దబంగ్‌ 4’ ఉంటుదని ఈ లెక్కన అర్థమైంది. మరి అట్లీ సినిమా ఎవరితో చేస్తారబ్బా? మళ్లీ విజయ్‌తో అంటే.. ఆయన సినిమాలకు బ్రేక్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus