‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.99 cr |
సీడెడ్ | 0.44 cr |
ఉత్తరాంధ్ర | 0.53 cr |
ఈస్ట్ | 0.31 cr |
వెస్ట్ | 0.22 cr |
గుంటూరు | 0.30 cr |
కృష్ణా | 0.30 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.79 cr |
ఓవర్సీస్ | 0.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.79 cr (షేర్) |
‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.5.79 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా రూ.1.59 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి సూపర్ హిట్ గా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!