‘సమాజం’ కోసం సమంత!!!

  • September 5, 2016 / 11:21 AM IST

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో సొంత వారినే పట్టించుకునే అంత సమయం దొరకక పోవడం చాలా సహజం అనే అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదన మీద పెట్టే శ్రద్ద, కుటుంభంపై, ఇంకా చెప్పాలి అంటే తన వారిపై పెట్టడం మరచిపోతారు. అదే క్రమంలో సమాజం గురించి అని అడిగితే…’నా వాళ్ళని చూసుకోవడానికే టైమ్ లేదు’ ఇక సమాజం మన వల్ల కాదు అని అంటారు. ఇదిలా ఉంటే మన ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజం గురించి ఆలోచించాలి అంటుంది అందాల భామ సమంతా. మన చేసే సహాయం, దాని వల్ల వారు పొందే ఆనందం చాలా గొప్పవి అని చెబుతుంది. ఇంకా చెప్పాలి అంటే సమాజం కోసం బ్రతకడంలో చాలా తృప్తి ఉంటుంది అని అంటుంది….నిజమే ఒక చిన్న సాయం చేసి.. తెగ ప్రచారం చేసేసుకునే వారు ఉన్న నేటి తరంలో వేలకొద్దీ చిన్నారులకు సాయం చేస్తూ.. ఎలాంటి పబ్లిసిటీ కోరుకోని అరుదైన వ్యక్తిత్వం సమంతది.

ఇక ఆమె ప్రత్యూష అనే సంస్థ పేరుతో సమాజానికి ఎంత సేవ చేస్తుందో చాలా మందికి తెలీదు. దిల్ సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్లు మొదలుకుని రీసెంట్ గా చాందిని సంఘటన వరకూ సమంత రియాక్ట్ అయిన తీరు అందరినీ ఆలోచింపచేస్తుంది. దిల్ సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ల సమయంలో కాలు కోల్పోయిన రజితను ఆధుకున్న తీరు, రోడ్డుపై నడుస్తుంటే యాక్సిడెంట్ లో ఓ పెద్దావిడ రెండు చేతులు.. చాందిని కాలు విరిగిపోవడంతో, లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్ ఖర్చుల కోసం మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి ద్వారా చికిత్స చేయించిన విధానం చూస్తుంటే ఈ బ్యూటీకి అందమే కాదు అందమైన మనసు కూడా ఉంది అని తెలుస్తుంది. అసలు సమాజం పై ఇంత తాపత్రయం ఎందుకు అంటే…జీవితాన్ని అర్ధవంతంగా మార్చేది సహాయం అని, తన ద్వారా ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే.. దేవుడు తనకింత మంచి స్థాయి ఇచ్చాడని చెబుతుంది ఈ బ్యూటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus