Samantha: సమంత బాలీవుడ్‌ ఎంట్రీ.. భయపెడుతూ!

ఇదిగో ఆ సినిమా, అదిగో ఈ సినిమా అంటూ.. గత కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్‌ ఎంట్రీ మీద పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయిపోయింది, ఓకే అయిపోయింది అని కూడా అంటున్నారు. అయితే ఏమైందో, ఏమువుతుందో కానీ.. ఇంతవరకు ఆ సినిమా ఓకే అవ్వడం లేదు. ఈ లోపు సమంత ఓ వెబ్‌సిరీస్‌ను ఓకే చేసుకుంది అని కూడా అంటున్నాయి. అయితే తాజాగా సమంత బాలీవుడ్‌ సినిమాకు సంబంధించి ఓ కీలక విషయం బయటికొచ్చింది. దాని బట్టి చూస్తే.. సమంత తొలి బాలీవుడ్‌ సినిమాలో డబుల్‌ రోల్‌ చేస్తుందట.

బాలీవుడ్‌లో ‘స్త్రీ’, ‘బాలా’ అనే సినిమాలతో దర్శకుడు అమర్‌ కౌశిక్‌ అదరగొట్టారు. ఆయన దర్శకత్వంలోనే సమంత తొలి బాలీవుడ్‌ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. రాజస్థాన్‌ నేపథ్యంలో సాగే జానపద కథ సినిమాలో సమంత రాజ్‌పుత్‌ రాణిగా, ప్రేతాత్మగా కనిపిస్తుందట. అంటే రెండు భిన్నమైన పాత్రల్లో సమంత తొలి బాలీవుడ్‌ సినిమా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా ఆమె ప్రేమికుడిగా కనిపిస్తాడట. ఈ మేరకు సమంత ప్రస్తుతం ఆయుష్మాన్‌తో కలిసి ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ షాప్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది.

మరోవైపు సమంత బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌తో కలసి ఓ వెబ్‌ సిరీస్‌లో నటించనుందనే వార్తలూ వస్తున్నాయి. రస్సో బ్రదర్స్‌ తెరకెక్కించిన ‘సిటాడెల్‌’ అనే ఆంగ్ల వెబ్‌ సిరీస్‌కు ఇది ఇండియన్‌ వెర్షన్‌గా రూపొందనుంది. ఈ సిరీస్‌ కోసమే సమంత ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటోంది అని సమాచారం. మరోవైపు సమంత తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాలు పూర్తి చేసింది. త్వరలో ఆ సినిమా విడుదలవుతాయి. ఇవి కాకుండా విజయ్‌ దేవరకొండతో ‘ఖుషీ’ అనే సినిమా చేస్తోంది.

అలా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో ఏ కాలంలో బిజీ అవ్వడానికి సమంత ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రతి సినిమాలోనూ ఆమె పాత్రే ప్రధానంగా ఉండేలా చూసుకుంటోంది. ఆమె ఎంచుకున్న స్క్రిప్ట్‌లు ఈ విషయాన్ని తెలియజేస్తాయి కూడా.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus