Samantha, Nayanthara: రెమ్యునరేషన్ లో నెంబర్ 2గా సమంత?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సమంత పేరు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె గతంలో ఎప్పుడూ లేని విధంగా తన కెరీర్ విషయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధమైంది. సమంత ఎలాంటి వర్క్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో ఎదో ఒక విధంగా హైలెట్ అవుతోంది.

Click Here To Watch Now

ఇక ప్రస్తుతం ఆమె సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనంతరం అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తరువాత లేడి ఓరియెంటెడ్ ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే యశోద అనే మరో థ్రిల్లర్ సినిమా కూడా చేస్తుంది.

ఈ రెండు సినిమాలకు సమంత రెండు కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు టాక్ వస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులను కూడా ఇటీవల మొదలుపెట్టగా వాటికి కూడా రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన రేంజ్ ను కొనసాగిస్తున్న నయనతార ప్రస్తుతం ఒక సినిమాకు 3 నుంచి 4 కోట్ల వరకు ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత సమంత రెండున్నర కోట్లకు దాటినట్లు సమాచారం. భవిష్యత్తులో ఆమె వరుసగా మరో రెండు విజయాలు అందుకుంటే నయనతార తెలుగు రికార్డులు కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరి సమంత రాబోయే రోజుల్లో బాక్సాఫీసు వద్ద ఇంకా ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి. మరోవైపు పూజ హెగ్డే కూడా ప్రస్తుతం రెండు కోట్లకు దగ్గరలో పారితోషికం డిమాండ్ చేస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus