Vijay Devarakonda: విజయ్ చేసిన పనికి అతనిపై గౌరవం పెరిగిందంటా!

ప్రముఖ యాంకర్, నటి అనసూయ కొన్ని రోజుల కిందట అనవసరంగా విజయ్ దేవరకొండ మీద ట్వీట్ చెయ్యడం, మళ్ళీ దాని మీద ఆమె ఇంకో ట్వీట్ వెయ్యటం, ఇలా ఆమె కావాలనే చేసినట్టుగా కనపడుతోంది అని టాక్ నడుస్తోంది. ఆమె ఇంత చేసినా, విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వలన అతని గౌరవం పెరిగింది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అనసూయ ఆలా ట్వీట్ వెయ్యబట్టే, విజయ్ అభిమానులు రెచ్చిపోయారు.

ఆమె కెలుక్కొని, ఆమే అంతా చేసి, మళ్ళీ విజయ్ ని సారీ చెప్పమంటోంది, ఇది చాలా తప్పు అని పరిశ్రమలో అంటున్నారు. అసలు ప్రతి స్టార్ అభిమానులు వాళ్ళ స్టార్ ని అంటే, ఊరుకుంటారా, ఊరుకోరు. ఎవరికీ సాంఘీక మాధ్యమం లో కంట్రోల్ లేదు. అలాంటిది అందులో ఈమె వేసిన ట్వీట్ కి ఎవరో ఎదో కామెంట్ పెడితే, దానికి విజయ్ ఎందుకు సారీ చెప్పాలి అని పరిశ్రమలో అంటున్నారు. అదీ కాకుండా, అతను చాలా సంయనం పాటించి, సైలెంట్ గా వున్నాడు, అది చాలు అని అంటున్నారు.

అందువల్లే అతనికి గౌరవం ఇంకా ఎక్కువయింది అని కూడా అంటున్నారు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో యూనిట్ సభ్యుల మధ్య జరుపుకుంటాడు అని తెలిసింది. ఈరోజు ఈవెనింగ్ దర్శకుడు శివనిర్వాణ, టీం కొచ్చి చేరుకుంటారని, సమంత కూడా షూటిగ్ లో పాల్గొంటోంది అని తెలిసింది. విజయ్ పుట్టినరోజు సందర్బంగా ‘ఖుషి’ సినిమా నుండి పాటను విడుదల చేస్తున్నారు.

అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయింది, ఆ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా వస్తుంది అని అనుకుంటున్నారు. అలాగే దిల్ రాజు, పరశురామ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి కూడా లుక్ ఒకటి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇలా ఈ మూడు సినిమాల నుండి (Vijay Devarakonda) విజయ్ కి సంబంధించి వార్తలు వస్తాయని అనుకుంటున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus