Samantha,Chinmayi: నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత తన అందం అభినయంతో పాటు మధురమైన మాటలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమా విజయంలో సమంత వాయిస్ కూడా ముఖ్యపాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో సమంతకి సింగర్ చిన్మయి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ సినిమాలో చిన్మయి గొంతు సమంతకు బాగా సూట్ అవ్వడంతో ఆమె నటించిన అన్ని సినిమాలలోనూ చిన్మయి డబ్బింగ్ చెప్పింది.

గత కొంతకాలంగా సమంత తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. దీంతో సమంతతో విభేదాలు ఏర్పడ్డాయని.. అందువల్లే సమంత ఆమెను దూరం పెట్టిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై గతంలో చిన్మయి స్పందించి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈ వార్తల గురించి సమంత మాత్రం స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్న సంగతి నిజమేనని ప్రేక్షకులు భావించారు.

ఇదిలా ఉండగా తాజాగా చిన్మయి గురించి సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఒక్క ట్వీట్ తో ఇద్దరి మధ్య విభేదాలు లేవని సమంత స్పష్టం చేసింది. ప్రస్తుతం సమంత మయోసైటిసిస్ వ్యాధి నుండి నెమ్మదిగా కోలుకుంది. ప్రస్తుతం సమంత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బాలీవుడ్ వెబ్ సిరీస్ సీటాడెల్ షూటింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో వెబ్ సిరిస్ లోకి స్వాగతం పలుకుతూ ద్వయం రస్సో బ్రదర్స్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై చిన్మయి భర్త రాహుల్ స్పందిస్తూ…’ సమంత తన ప్రయాణం ఎలా కొనసాగించిందో నాకు బాగా తెలుసు. ద్వయం రస్సో బ్రదర్స్ తమ ప్రాజెక్ట్ లోకి సమంత ని ఆహ్వానించటం చాలా గర్వంగా ఉంది ‘ అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ చేసిన ట్వీట్ ని చిన్మయి రీ ట్వీట్ చేస్తూ..’ సమంత ఒక క్వీన్..ఇదే దానికి నిదర్శనం ‘ అంటూ ప్రశంసలు కురిపించింది. చిన్మయి చేసిన ట్వీట్ కి స్పందించిన సామ్ ” నేను కాదు .నువ్వే అంటూ ” ముద్దు సింబల్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus