Samantha: అలాంటి పాత్రలో సందడి చేయడానికి సిద్ధమైన సమంత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఈమె సినిమా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున సమంత గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సమంత సినిమాలకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ పనులలో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది సినిమా కాకుండా వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఇదివరకే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసినటువంటి ఈమె తాజాగా మరో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ కి రీమేక్ గా రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ లో సమంత రా ఏజెంట్ గా సందడి చేయబోతున్నట్లు సమాచారం.ఫుల్ యాక్షన్ ప్యాక్డ్స్ గా రూపుదిద్దుకోబోతోంది.

ఇప్పటికే సమంత ఈ ప్రాజెక్ట్ కోసం మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందింది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇక హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించగా తెలుగులో సమంత నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో షూటింగ్ పనులను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇవి కాకుండా సమంత శాకుంతలం యశోద ఖుషి వంటి సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus