Samantha, Naga Chaitanya: సమంతపై మండిపడుతున్న అక్కినేని ఫ్యాన్స్.. కానీ?

యంగ్ హీరో నాగచైతన్య నిన్న 35వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారనే సంగతి తెలిసిందే. సినిమా రంగానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చైతన్య నటిస్తున్న బంగార్రాజు సినిమా టీజర్ రిలీజ్ కాగా థాంక్యూ సినిమా నుంచి పోస్టర్ విడుదలైంది. అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. చైతన్య సమంత విడిపోతున్నట్టు నెలరోజుల క్రితం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

విడిపోయినా ఫ్రెండ్స్ లా ఉంటామని చైతన్య, సమంత వెల్లడించారు. అయితే ఇప్పుడు నాగచైతన్య, సమంత ఫ్రెండ్స్ లా కూడా లేరని అర్థమవుతోంది. కొంతమంది అక్కినేని అభిమానులు సమంత తీరుపై మండిపడుతున్నారు. భవిష్యత్తులో చైతన్య, సమంత కలిసి సినిమాలు చేసే ఛాన్స్ కూడా లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చైతన్య, సమంత మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే సామ్ అభిమానులు మాత్రం చైతన్యకు సమంత విషెస్ చెబితే ఆ పోస్ట్ గురించి కూడా వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందని భావించి సమంత సైలెంట్ గా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.

సమంత వ్యక్తిగతంగా చైతన్యకు విషెస్ చెప్పి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చైతన్య, సమంత వేర్వేరు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది చైతన్య నటించిన బంగార్రాజు, థాంక్యూ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. సినిమాసినిమాకు చైతన్య మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus