Samantha: ఆ విగ్రహం ఏంటి సమంత అభిమాని పై ఫ్యాన్స్ ఫైర్!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంతకు సందీప్ అనే అభిమాని ఏకంగా గుడి కట్టిన విషయం గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా హీరోయిన్లపై ఉన్నటువంటి అభిమానంతో చాలామంది వివిధ రకాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇదివరకే కొందరు హీరోయిన్లకు ఇలా గుడి కూడా కట్టారు. అయితే తెలుగులో మాత్రం సమంతకే ఇలా మొదటిసారి గుడి కట్టి పూజిస్తున్నారని చెప్పాలి.

ఈ విధంగా సమంతకు బాపట్లకు చెందిన సందీప్ అనే వ్యక్తి వీరాభిమాని కావడంతో,సమంత చేసే మంచి పనుల వల్ల తనకు అభిమానిగా మారిపోయానని అందుకే తనకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రెండు సంవత్సరాల క్రిందట తనకు ఏ ఆలోచన వచ్చిందని అయితే ఆ కోరిక ఇప్పటికి తీరిందని తెలిపారు.ఏప్రిల్ 28వ తేదీ సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె గుడి ప్రారంభం చేసి గ్రామస్తులకు విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.

ఇలా (Samantha) సమంతపై సందీప్ చూపిస్తున్నటువంటి అభిమానం చూసి సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సమంతకు గుడి కట్టిన విషయంపై సంతోషించిన అభిమానులు సమంత విగ్రహం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుడి కట్టడం బాగానే ఉంది కానీ గుడిలో సమంత విగ్రహం ఏమాత్రం బాగాలేదని అసలు ఎంతో అందంగా ఉన్నటువంటి సమంతను ఇలా అందవిహీనంగా తయారు చేశారు అంటూ మండిపడుతున్నారు.

ఆ విగ్రహం చూస్తే సమంతను తలపించడం లేదని పలువురు అభిమానులు ఆ విగ్రహంపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ గుడిని ఏర్పాటు చేయడం కోసం సందీప్ భారీగానే ఖర్చు చేశారట.ఈ గుడి నిర్మాణానికి ఈయన ఏకంగా ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు చేశారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కుష్బూ హన్సిక అంటే హీరోయిన్ల తర్వాత తెలుగులో సమంతకు గుడి కట్టడం విశేషం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus