సమంత X నాగచైతన్య… అసలు ఈ మాటే ఇప్పటివరకు వినిపించలేదు, ఎక్కడా జరిగింది లేదు. మీరెందుకు ఇలా రాశారు అని అనుకుంటున్నారా? మేం అన్నది ఆ ఇద్దరి గురించి కాదు. వాళ్ల అభిమానుల గురించి. సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా చైతన్య, సామ్ ఫ్యాన్స్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఖుషి’ సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాల గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో చైతు గత సినిమాల వీడియోలు కూడా చర్చలోకి వచ్చాయి.
కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య జరిగిన కథ అంటూ ‘ఖుషి’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ క్రమంలో జంట మధ్య జరిగే అన్ని రకాల అంశాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. మాటలు, ఆటలు, పొట్లాటలు, కౌగిలింగలు, ముద్దులు… ఇలా చాలానే సినిమాలో ఉన్నాయి. అయితే ముద్దు సన్నివేశాల విషయంలో ఆమెను టార్గెట్ చేస్తూ చైతన్య ఫ్యాన్స్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దానికి సామ్ ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు.
చైతన్య, సమంత (Samantha) విడాకుల తర్వాత… సామ్ ఏం చేసినా ట్రోల్ చేసేందుకు కొంతమంది నెటిజన్ఉ రెడీగా ఉన్నారు. తాజాగా ‘ఖుషి’ సినిమాలో విజయ్‌తో సమంత చేసిన రొమాన్స్, లిప్ లాక్‌ల మీద కొంతమంది నెగెటివ్ కామెంట్లు చేశారు. సమంతను ట్రోల్ చేశారు. సమంత ఇలా ఎలా చేస్తుంది అంటూ ప్రశ్నించారు. అయితే జెంటిల్ మన్ అని చెప్పుకునే నాగ చైతన్య కూడా ఇలానే చేశాడు కదా అంటూ ‘థ్యాంక్యూ’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ట్వీట్ చేస్తున్నారు.
చైతన్య, రాశీ ఖన్నా ఆ సినిమాలో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తే చైతన్యను ఏమీ అనలేదు కానీ… ఇప్పుడు సమంతను ట్రోల్ చేస్తున్నారా? అంటూ నిలదీశారు. హీరో లిప్ లాక్ చేస్తే ఒకలా.. హీరోయిన్ లిప్ లాక్ సీన్స్‌లో నటిస్తే ఇంకోలా రియాక్ట్ అవుతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చర్చ ఎంతవరకు ఇలా వెళ్తుందో చూడాలి.