Samantha: ‘మజిలీ’ సాంగ్ రాగానే ఎమోషనల్ అయిన సమంత!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ నిన్న హైటెక్స్ లో ఉన్న నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారీగా జనాలు తరలివచ్చారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినీ వేడుకని జనాలు చూసుండరు. విజయ్ దేవరకొండకి ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా.. ఇంత పెద్ద స్టార్ హీరో అయిపోయాడా ఇతను..? అనేంతలా అంతా ఆశ్చర్యపోయారు. ‘ఖుషి’ (2023 ) సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.

మలయాళంలో హిట్ అయిన ‘హృదయం’ సాంగ్స్ ఇంకా అందరి మైండ్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకి పనిచేసిన హేషామ్ అబ్దుల్ వాహాబ్ … ‘ఖుషి’ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ‘ఖుషి’ మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకలో విజయ్ దేవరకొండ – సమంత కలిసి డాన్స్ చేయడం హైలెట్ గా నిలిచింది. దీనిపై రకరకాల ట్రోల్స్ వస్తున్నప్పటికీ వారి అభిమానులను మాత్రం ఆకర్షించే ఎలిమెంట్స్ ఇవి అని చెప్పొచ్చు.

ఇది పక్కన పెడితే.. ‘ఖుషి’ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. గతంలో ఇతను తెరకెక్కించిన ‘మజిలీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది సమంత. అదే సినిమాలో హీరోగా నాగ చైతన్య నటించిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి ‘ఖుషి’ ఆడియో వేడుకలో ఆ సినిమా సాంగ్ ప్రోమో కూడా టెలికాస్ట్ అయ్యింది. ఆ టైంలో సమంత కొంచెం ఇబ్బంది పడినట్టు కనిపించింది. ఆమె ఎమోషనల్ అయినట్టు కూడా నెటిజన్లు కామెంట్స్ పెడుతూ.. ‘మాజీ భర్త గుర్తొచ్చినట్టు ఉన్నాడు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus