Samantha: IMDB జాబితాలో రికార్డు సృష్టించిన సమంత!

సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఒకప్పుడు కేవలం దక్షిణాది సినిమాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈమె ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.ఇలా సమంతకు సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈమె హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో సమంత రోజురోజుకు ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆదరణ పొందినటువంటి సెలెబ్రెటీల జాబితాని ఇండియన్ మూవీ డేటా బేస్ (imdb) వారు సర్వే చేసి విడుదల చేస్తుంటారు. ఈ సర్వే ఫలితాలను విడుదల చేయగా ఇందులో సమంత సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఈ సర్వేలో 9వ స్థానంలో ఉన్నటువంటి సమంత అనూహ్యంగా ఒకటో స్థానంలోకి చేరుకున్నారు.

ఈ జాబితాలో అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ఈమె ఒకటో స్థానంలో ఉండటంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జాబితాలో పూజా హెగ్డే 17వ స్థానంలో ఉన్నారు. సమంత గతంలో తొమ్మిదవ స్థానంలో ఉండగా ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా నటీనటులకు వారు నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లకు వచ్చిన ఆదరణ బట్టి IMDB వారు రేటింగ్స్ ప్రకటిస్తారు. మరి ఇలాంటి లిస్టులో సమంత (Samantha) అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు ఖుషి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus