స్టార్ హీరోయిన్ సమంత గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు. ప్రస్తుతం సమంత చేతిలో ఖుషి, సిటాడెల్ ఉండగా ఈ రెండు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే సమంత కెరీర్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే తాజాగా సమంత ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. గతంలో మాజాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సమంత ప్రస్తుతం పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ యాడ్ లో సమంత డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వేర్వేరు రకాల క్యాస్టూమ్స్ లో సమంత కనిపించడం ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగించింది. సమంత యాడ్ వల్ల పెప్సీ సేల్స్ ఊహించని స్థాయిలో పెరుగుతాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒక్కొక్కరు ఒక్కో కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
నాగార్జున ప్రస్తుతం మాజాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా (Samantha) సమంత పెప్సీ తరపున ప్రచారం చేస్తున్నారు. కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ భవిష్యత్తు సినిమాలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తారో లేక షాకిస్తారో చూడాల్సి ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచినా సమంత మార్కెట్ పై అణువంత ప్రభావం కూడా పడలేదు. సమంత సరైన కథలను ఎంచుకుంటే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించగలరు. సమంత కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూడాల్సి ఉంది. స్టార్ హీరోలకు జోడీగా సమంత నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.