Samantha: వైరల్ అవుతున్న సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీ!

చైతన్య సమంత విడిపోయి దాదాపుగా ఆరు నెలలు అవుతున్నా వీళ్లిద్దరి అభిమానులలో చాలామంది ఇప్పటికీ వీళ్ల విడాకుల వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. చైసామ్ కలిసి సినిమాలు చేయాలని కలిసి జీవనం సాగించాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విడాకుల తర్వాత పలు సందర్భాల్లో చైతన్య సమంత పేరును ప్రస్తావిస్తున్నా సమంత మాత్రం చైతన్య పేరును ప్రస్తావించడం లేదు. అయితే తాజాగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మజిలీ సినిమా పోస్టర్ ను పోస్ట్ చేయగా ఆ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

శివ నిర్వాణ డైరెక్షన్ లో చైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన మజిలీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రేమ కథలను, కుటుంబ కథలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి మూడేళ్లు కావడం గమనార్హం. చైతన్య సమంత విడిపోయిన తర్వాత వేర్వేరుగా షూటింగ్ లతో బిజీ అవుతున్నారు. సమంత సోషల్ మీడియాలో చైతన్యతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను డిలీట్ చేయగా చైతన్య మాత్రం సామ్ తో దిగిన ఫోటోలను అలాగే ఉంచారు.

సమంత చైతన్యతో ఉన్న పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. చైసామ్ అపార్థాలను తొలగించుకుని సంతోషంగా బ్రతికితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మజిలీ సినిమాలోలా చైసామ్ కలిసి జీవిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విడాకుల తర్వాత అటు చైతన్యకు ఇటు సమంతకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. చైసామ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో మజిలీ సినిమా ఒకటిగా నిలిచింది.

మజిలీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో సమంత పోషించిన శ్రావణి పాత్రలాంటి భార్య వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే చైతన్య మాత్రం మజిలీ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus