Samantha: అర్హ ఎవరి కూతురు.. తగ్గేదే లేదిక్కడ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమతో కలిసి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా సమంత (Samantha) ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు. ఇకపోతే ఈ సినిమాలో శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అల్లు వారసురాలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుమ అర్హ గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఇక అర్హ గురించి సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.అర్హ సెట్లో తెలుగులో మాట్లాడుతుంటే ఎంత క్యూట్ గా ఉందో చెప్పలేనని సమంత వెల్లడించారు.

ఈ సినిమాలో అర్హకు తెలుగులో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. చుట్టూ వంద మంది ఉన్న ఆమె ఏమాత్రం భయపడకుండా ఆ డైలాగ్స్ ఎంతో అద్భుతంగా చెప్పిందని సమంత వెల్లడించారు.సమంత ఇలా చెప్పడంతో వెంటనే సుమా అర్హ ఎవరి కూతురు తగ్గేదే లేదు ఇక్కడ అంటూ చెప్పగా సమంత కూడా తగ్గేదే లే అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది కానీ తెలుగు నేర్చుకోవడం అంటే చాలా కష్టమైన పని.

కానీ అర్హకు ఎంతో అద్భుతంగా తెలుగు నేర్పించారు. ఈ విషయంలో బన్నీకి స్నేహారెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పచ్చు అంటూ సమంత అర్హ గురించి తెలియజేశారు.ఇలా ఇంత చిన్న వయసులోనే అర్హ ఎంతో అద్భుతంగా నటించింది అంటూ సమంత తెలియచేయడంతో బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus