Samantha: సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న సామ్!

టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు సైతం సమంత నటన గురించి గొప్పగా చెబుతుంటారు. పెళ్లి తరువాత సమంత సరికొత్త కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సమంత మాత్రం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతోందట.

నిజానికి సమంత నుండి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆమె ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తుంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ.. రీట్వీట్స్ చేస్తూ.. ఫ్యాన్స్ తో మాట్లాడుతూ హడావిడి చేస్తుంటుంది. పోస్ట్ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తుంటుంది. కానీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ విషయంలో సమంత అంత యాక్టివ్ గా ఉండలేకపోతుంది. దానికి కారణం తమిళులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే. తమిళ టైగర్స్ ను ఈ సిరీస్ లో ఉగ్రవాదులుగా చూపించారంటూ పెద్ద వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తమిళమ్మాయి అయిన సమంత ఈ సిరీస్ లో నటించడాన్ని తప్పుబడుతూ ఆమెపై విరుచుకుపడ్డారు.

ఇప్పుడు సీజన్ రిలీజైన తరువాత అందులో తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విషయాలు లేకపోవడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. కానీ సమంత మాత్రం ఈ సిరీస్ కు సంబంధించి తన ఎగ్జైట్మెంట్ ను కంట్రోల్ చేసుకోక తప్పడం లేదు. ఇప్పుడు సిరీస్ గురించి ఏమైనా మాట్లాడితే తనను టార్గెట్ చేస్తారేమో అని గమ్మునుండిపోయింది. ఒక్క ఇన్స్టాగ్రామ్ లో ఫార్మాలిటీగా ఓ పోస్ట్ పెట్టింది అంతే. బాలీవుడ్ లో తనకు ఇంత మంచి పేరొస్తున్నా.. సమంత మాత్రం సంతోషంగా లేదట. తన సిరీస్ ను తనే ప్రమోట్ చేసుకోలేకపోతున్నానని, ఇంత పెద్ద సక్సెస్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నానని.. తన సన్నిహితుల వద్ద వాపోతుందట సమంత.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus