టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అవసరం లేదు. అయితే ఈమె తన అనారోగ్య సమస్య కారణంగా ప్రస్తుతం సినిమాకు కాస్త విరామం ఇచ్చి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం వివిధ దేశాలకు వెళుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈమె ఈ వ్యాధి నుంచి మెల్లిమెల్లిగా కోలుకున్నారని తెలుస్తుంది. ఈ విధంగా సమంత మయోసైటిసిస్ నుంచి కోలుకోవడంతో తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటివరకు హీరోయిన్ గా మెప్పించినటువంటి సమంతా ఇకపై నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని తెలుస్తోంది. ఇదివరకే ఈమె తన ప్రొడక్షన్ హౌస్ గురించి సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈమె ప్రొడక్షన్లో మొదటి సినిమా అవకాశం ఎవరు అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది ఇదిలా ఉండగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.
తాజాగా ఈమె వర్కౌట్ చేస్తూ జిమ్ లో కష్టపడుతున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటో ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ ఈ ఏడాదికి ఇదే ఆఖరి వర్కౌట్ అంటూ ఈమె కామెంట్ చేశారు. మరొక రోజు గడిస్తే మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో ఈమె ఇలాంటి పోస్ట్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం సమంత (Samantha) షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!