సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సమంత తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు ఇలా ఈమె ఖుషి సినిమాతో పాటు సిటాడిల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సిరీస్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో కూడుకొని ఉందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇకపోతే ఈమె ఈ సిరీస్ కోసం భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ కష్టపడుతున్నారు.గత కొద్ది రోజుల క్రితం చేతులకు మొత్తం గాయాలు అయినటువంటి ఫోటోలను షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా సమంత మరొక ఫోటో షేర్ చేశారు.
ఐస్ బాత్ చేస్తూ తాను ఇబ్బందులలో ఉన్నానని ఈ ట్రబుల్స్ నుంచి బయటపడటం కోసమే ఇలా చేస్తున్నాను అంటూ క్యాప్షన్ జోడించారు.ఈ వెబ్ సిరీస్ కోసం యాక్షన్ సన్నివేశాలలో నటించాల్సి వస్తుంది అయితే వీటి నుంచి ఉపశమనం పొందడం కోసమే సమంత ఇలా ఐస్ బాత్ చేస్తుందని తెలుస్తుంది.ఏది ఏమైనా ఇలా ఐస్ బాత్ లో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు కానీ సమంత ఈ సిరీస్ కోసం ఈ స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తుందని చెప్పాలి.
ఇలా (Samantha) సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.