టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాదిపాటు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మయోసైటిసిస్ వ్యాధి కారణం అని చెప్పాలి. ఈ వ్యాధి కారణంగా కొంతకాలం పాటు ఎంతో ఇబ్బంది పడినటువంటి సమంతం ఇండస్ట్రీకి దూరంగా ఉండి కాస్త కోలుకొని తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు.
అయితే ఈమె అప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా కొంత భాగం షూటింగును కూడా పూర్తి చేసుకున్నారు. ఇక సమంత కోసం ఆ సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. దీంతో సమంత పూర్తిగా తనకు నయం అయ్యే వరకు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సినిమాలకు దూరమైనటువంటి ఈమె ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ మానసిక ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. అయితే సమంత సినిమాలకు దూరం అవ్వాలి అనే నిర్ణయం తీసుకోకముందే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు భారీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలలో నటిస్తూ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బంది అని భావించినటువంటి సమంత ఈ సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.ఈ క్రమంలోనే సదరు నిర్మాతలు నుంచి తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చారని సమాచారం. ఇలా సమంత మూడు ప్రాజెక్టులకు కమిట్ అవుతూ తీసుకున్నటువంటి అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె క్రేజ్ దృష్ట్యా ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ సినిమాల నుంచి సమంత తప్పుకోవడంతో దాదాపు 12 కోట్ల రూపాయలను నష్టపోయారని తెలుస్తుంది. అయితే డబ్బు కన్న తన ఆరోగ్యానికి సమంత ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.