Samantha: ఆ వార్తలన్నీ అవాస్తవం కొట్టి పారేస్తున్న మేనేజర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హింది వంటి భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమంత గత కొంతకాలంగా మీడియాలో ఎక్కడ కనిపించడం లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండి తన పర్సనల్ విశేషాలతో పాటు సినిమాకు సంబంధించిన విశేషాలను కూడా పంచుకునే సమంత గత కొంతకాలంగా సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంది.

దీంతో సమంత అనారోగ్యం వల్లే ఆమె సినిమాలకు దూరమైందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె అనారోగ్యానికి సంబంధించిన కారణాలు కూడా రకరకాలుగా వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి సమంత చర్మ వ్యాధితో బాధపడింది. అలాగే ఇప్పుడు కూడా సమంత చర్మ వ్యాధితో బాధపడుతోందని కొందరు అంటుంటే మరి కొంతమంది మాత్రం వ్యాయామాలు చేసే సమయంలో అధిక బరువులు ఎత్తటం వల్ల అనారోగ్యం పాలైందని అంటున్నారు. తాజాగా సమంత గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సమంత `పాలీమర్‌ ఫోర్స్ లైట్‌ ఎరప్షన్‌` అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తల గురించి సమంత మేనేజర్ స్పందిస్తూ… సమంతకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని వెల్లడించాడు. ఆమె ఆరోగ్యం పట్ల వస్తున్న పుకార్లలో నిజం లేదని వాటిని నమ్మకండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సమంత ఇప్పుడు అమెరికాకు వెళ్లడానికి గల కారణం ఏమిటని ఆమె అభిమానుల్లో అనుమానం మొదలైంది.

ఇలా సమంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈమె సినిమా షూటింగ్లలో పాల్గొనకుండా ఉన్నఫలంగా అమెరికా ఎందుకు వెళ్లారు అనే సందేహం మాత్రం అలాగే ఉండిపోయింది.ఇలా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వార్తలో ఒకవైపు వస్తూనే మరోవైపు రెండో పెళ్లికి కూడా సిద్ధమైందనే వార్తలు వినపడుతున్నాయి.ఈ వార్తలన్నిటికీ పులి స్టాప్ పడాలంటే తిరిగి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ కావాల్సి ఉంటుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus