Samantha: హాస్పిటల్ లో సమంత.. ఏం జరిగింది?

సమంత(Samantha)  మళ్లీ ఆసుపత్రిలో కనిపించడం ఆమె అభిమానులను కలవరపెట్టింది. గత కొంతకాలంగా మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న ఆమె, ఇటీవల తన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా బిజీగా మారింది. ఈ మధ్యే ఉన్న హనీ బన్నీ తో హై ఎనర్జీగా కనిపించి, అనంతరం రక్త బ్రహ్మాండ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. అంతేకాదు, తన సొంత బ్యానర్‌పై మా ఇంటి బంగారం సినిమాను ప్రారంభించి నిర్మాతగా కూడా అడుగుపెట్టింది. ఇంత యాక్టివ్‌గా ఉంటున్న సమంత ఒక్కసారిగా ఆసుపత్రి బెడ్ మీద కనిపించడంతో ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందా.అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

Samantha

అసలు విషయమేమిటంటే, సమంత ఆసుపత్రిలో సెలైన్ తో ఉన్న ఫోటో తనే స్వయంగా షేర్ చేసింది. ఇది చూసి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఆమె ఇచ్చిన సందేశం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తన పోస్ట్‌లో ఓ సుదీర్ఘ లేఖను షేర్ చేస్తూ, “సముద్రంలో కలిసే నది తన దిశను ఎప్పుడూ మార్చదు. మార్గంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా చివరకు సముద్రంలో కలుస్తుంది” అనే భావనను వ్యక్తం చేసింది. దీని ద్వారా తన ఆరోగ్యం పట్ల భయపడకుండా, ఎదుర్కొంటూనే ముందుకు వెళ్లాలనే సందేశాన్ని ఆమె ఇవ్వడం గమనార్హం.

ఈ పోస్ట్‌ వల్ల అభిమానులు కొంత ఉపశమనం పొందినప్పటికీ, సమంత ఆరోగ్యంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. ఇది కేవలం ఓ రొటీన్ చెకప్ మాత్రమేనా లేక మళ్లీ మయోసైటిస్ ఇబ్బంది పెడుతోందా అనే అంశంపై ఆమె ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఈ వ్యాధితో తీవ్రమైన అనారోగ్యం అనుభవించిన సమంత, చికిత్స అనంతరం తిరిగి తన కెరీర్‌ను చురుకుగా కొనసాగించింది. కానీ ఈ మధ్యే ఫిజియోథెరపీ, మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆమె రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు వెళ్లడం, అభిమానుల్లో మరింత ఆందోళనను పెంచుతోంది.

సమంతకు ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ లిస్ట్ చూస్తే, ఆమె పూర్తి స్థాయిలో మళ్లీ యాక్టివ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ మధ్య ఆమె హెల్త్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత గ్యాప్ తీసుకోవాలని కూడా భావిస్తోందని టాక్. అయినా, ఇంతలోనే ఆసుపత్రి ఫోటో షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక సమంత అభిమానులు మాత్రం “ఏ సమస్య వచ్చినా ఆమె పోరాటం ఆగదు.. ఆమె ఎప్పటికీ స్ట్రాంగ్!” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వందల కోట్లతో సినిమా చేసి ఇప్పుడు 20 కోట్లకు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus