సమంత (Samantha) నుండి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. 2023 లో వచ్చిన ‘శాకుంతలం’ (Shaakuntalam) , ‘ఖుషి’ (Kushi) వంటి సినిమాల తర్వాత సమంత నుండి మరో సినిమా రాలేదు. ‘ఖుషి’ సినిమా టైంలో సమంత లుక్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సినిమాలకు కొంత బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తన హెల్త్ పై ఫోకస్ పెట్టి.. పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాలపై దృష్టి పెడతానని ఆమె చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
మధ్యలో తమిళంలో చాలా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసినట్టు సమంత చెప్పుకొచ్చింది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటించిన సామ్… హిందీలో మరింత అప్రిసియేషన్ దక్కించుకుంది. అలాగే గ్లోబల్ గా కూడా తనకు ఏర్పడ్డ ఫాలోయింగ్ ను రెట్టింపు చేసుకుంది. ఇదిలా ఉండగా.. సమంత ఓ కొత్త లుక్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమెకు జుట్టు చాలా తక్కువగా ఉంది. పక్క పాపిడి దువ్వుకుని.. ఓ యంగ్ ఏజ్ కుర్రాడిలా ఈ ఫొటోల్లో సమంత కనిపిస్తుంది.
‘ఈ ఫోటోలు లేటెస్ట్ ఫొటోలా లేక.. పాత ఫొటోలా?’ అనే డౌట్ కూడా ఆడియన్స్ లో ఉంది. ఈ ఫొటోలకి సమంత రాసుకొచ్చిన క్యాప్షన్ కూడా ‘మెంటల్ హెల్త్, పీస్(శాంతి, ప్రశాంతత) వంటి మీనింగ్లు వచ్చేలా ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది యాంటీ ఫ్యాన్స్.. ‘నాగ చైతన్య (Naga Chaitanya) 2వ పెళ్లి చేసుకున్నందుకు సమంత ఇలా అయిపోయిందా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు వదులుతుంటే.. ఇంకొంతమంది మాత్రం ‘ టూ బోల్డ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.