Samantha: ఫ్యాన్స్‌ను కలవరపెట్టి.. అసలు విషయం చెప్పిన సమంత!

  • April 27, 2023 / 11:56 AM IST

సమంత ఇటీవల కాలంలో ఏం చేసినా చర్చనీయాంశంగానే మారిపోతోంది. ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎక్కడ ఫొటోలు దిగినా, దేని గురించి చెప్పినా డిస్కషన్‌ జరుగుతోంది. అయితే దానికి ఆమె గతంలో చేసిన కొన్ని కామెంట్స్‌ కూడా కారణం. దాంతోపాటు ప్రస్తుతం ఆమె గూగుల్‌ను వాడుతున్న స్టైల్‌ కూడా మరో కారణం. రీసెంట్‌గా ఓ విషయం గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసి.. ఆ వివరాలను స్క్రీన్ షాట్‌ రూపంలో షేర్‌ చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేసింది. అయితే ఈసారి అది ఆమె గురించి.

మొన్నీమధ్యనే సమంత అనారోగ్యం నుండి కోలుకుంది. ‘యశోధ’, ‘శాకుంతలం’ సినిమాల డబ్బింగ్‌, విడుదల సమయంలో సమంత చాలా అనారోగ్యంగా ఉంది. ప్రచార కార్యక్రమాలకు కూడా ఒక వ్యక్తిని సహాయంగా తీసుకొని నడిచింది. గ్లాసెస్‌ పెట్టుకుని చాలా డల్‌గా కూడా కనిపించింది. ఆ తర్వాత లండన్‌లో జరిగిన ‘సిటాడెల్‌’ స్పెషల్‌ షో దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి అంతా మారిపోయి పాత సమంత కనిపించింది అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ఇటీవల మళ్లీ సమంత సోషల్‌ మీడియాలో మాస్క్‌తో కనిపించింది.

సమంత (Samantha) లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చూసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆక్సిజన్ మాస్క్‌తో సమంత కనిపించేసరికి ఏమైంది సామ్‌కి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. గతంలో సమంత మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ అదేమైనా తిరగబెట్టిందా అనుకున్నారు. గతేడాది అక్టోబరులో సమంత తన హెల్త్ ప్రాబ్లమ్ బయట పెట్టింది. మళ్లీ అలా ఇప్పుడేమైనా చెబుతుందా అని అనుకున్నారంతా. అయితే ఇది అనారోగ్యం కాదని, ఓ రకమైన థెరపీ కోసమని చెప్పింది.

హైపర్బేరిక్ థెరపీ కోసం అలా మాస్క్‌ పెట్టుకున్నాను అని చెప్పిన సమంత.. ఆ వివరాల గూగుల్‌ సెర్చ్‌ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్‌చేసింది. కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి ఈ థెరపీ కాపాడుతుందట. పాడైన కండరాలను బాగు చేస్తుందట. మయోసైటిస్ సోకిన నేపథ్యంలో సమంత హైపర్బేరిక్ థెరఫీ తీసుకుంటున్నారని ఈ క్రమంలో అర్థమవుతోంది. అసలు విషయం తెలిశాక సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus