Samantha: ఇలా తింటే అందం, ఆరోగ్యం అంటున్న సమంత.. ఏం చెప్పిందంటే..?

మంచో చెడో చాలా రోజులుగా టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో సమంత తెగ ట్రెండ్‌ అవుతోంది. ఏదో విషయంలో ఆమె ప్రస్తావన వస్తూనే ఉంది. ఆమెను కథానాయికగా ఆరాదించేవారు వావ్‌ అనుకుంటుంటే.. మరికొందరేమో ఎందుకు సమంత ఇలా చేస్తోంది అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే సమంత డైట్‌ ఇదే అంటూ కొన్ని విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించడానికి సమంత ఏం చేస్తుంది, ఏం తింటుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు మనమూ చూద్దాం.

మయోసైటిస్ రుగ్మత బారిన పడిన సమంత… ఇటీవల కోలుకొని ఇప్పుడు కుదురుకుంటోంది. కసరత్తులు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సమంత తిరిగి పూర్వపు ఫిట్‌నెస్‌ సాధిస్తోంది. అందరికీ తెలిసినట్లే సమంత శాఖాహారి. కూరగాయలు, ఆకు కూరలు తనే స్వయంగా పండించుకుంటుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. సామ్‌ రోజూ ఉదయమే కొల్లాజెన్ షేక్ తీసుకుంటుందట. ఆకు కూరలు, ఫ్రీజింగ్ అరటి పండు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, చియా విత్తనాలు, అవిసె గింజలు, వెజ్‌ కొల్లాజెన్ పౌడర్ కలిపి ఈ షేక్‌ చేస్తారు.

కొవ్వులతో నిండిన వెన్నకు ప్రత్యామ్నాయమైన మాచా, జీడిపప్పు మిశ్రమాన్ని తీసుకుంటుందట. టోస్ట్, పాన్ కేక్‌ మీద దీన్ని రాసుకుని తింటుంది. మాచా అంటే గ్రీన్ టీ పౌడర్. ఇందులో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్ తినాలంటే వేగన్ ఐస్‌క్రీమ్‌కి ఓటేస్తుందట. రుచికరమైన పండ్లతో ఈ ఐస్ క్రీమ్స్ చేసుకుంటుందట. సొంతంగా బాదం మిల్క్ తయారు చేసుకుని దానినే తాగుతుందట. ఇలాంటి ఏర్పాట్లు చేసుకుని సమంత తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది అని సమాచారం.

ఇక సమంత (Samantha) సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్‌’ ఇండియన్‌ రీమేక్‌లో నటిస్తోంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో కలసి ‘ఖుషి’ సినిమా చేస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ అవుతుందట. ‘సిటాడెల్‌’ ఇటీవల మొదలైంది. వరుణ్‌ ధావన్‌ ఇందులో ఒక ప్రధాన పాత్రధారి. మరోవైపు ‘సిటాడెల్‌’ హాలీవుడ్‌ వెర్షన్‌ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus