సమంత.. గతేడాది చివర్లో మాయోసైటీస్ అనే వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆ వ్యాధి వల్ల ఆమె ఎక్కువగా తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఆయాసంతో బాధపడుతుంది. ఇదివరకటిలా సమంత యాక్టివ్ గా నిలబడలేదు, ఎక్కువ సేపు నిలబడి మాట్లాడలేదు. కొంచెం జలుబు, జ్వరం వంటివి వచ్చినా ఆమె రెండు రోజుల పాటు బెడ్ దిగే అవకాశం ఉండదు. అందుకే ఆమె సినిమాలు తగ్గించింది. ఈ ఏడాది సమంత నుండి వచ్చిన ‘శాకుంతలం’ ‘ఖుషి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
‘ఖుషి’ పర్వాలేదు కానీ.. ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఖుషి సినిమాకి హిట్ టాక్ వచ్చినా సమంత లుక్స్ పై ట్రోలింగ్ జరిగింది. ఇలాంటివి చూసే అనుకుంట ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు. ఇదివరకు అయితే ఆమె ఎక్కువగా అభిమానులతో ఇంటరాక్టివ్ అయ్యేది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పేది. ఇప్పుడు ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ.. వస్తోంది. ఇదిలా ఉండగా.. సమంత పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇందులో ఆమె (Samantha) పింక్ డ్రెస్ లో కనిపిస్తుంది. చేతులు పైకెత్తి నాభి అందాలు ప్రదర్శిస్తూ.. తన గ్లామర్ ను అభిమానించే వారికి ఫీస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఈ ఫోటోలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఈ ఫొటోల్లో చాలా బక్కగా కనిపిస్తుంది. ఏజ్డ్ లుక్‌లోకి సమంత వచ్చేసింది అంటూ కొందరు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు