Samantha: సామ్ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయా?

స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. మరో నెల రోజుల్లో శాకుంతలం మూవీ రిలీజ్ కానుండగా ఈ నెలాఖరు నుంచి సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఏకంగా మూడు వారాల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ కు సమయం కేటాయించాలని సమంత భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. సమంతను నమ్ముకుని గుణశేఖర్ ఈ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

అయితే ఈ సినిమాకు ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రుద్రమదేవిలో అల్లు అర్జున్ లా ఈ సినిమాలో కూడా ఎవరైనా పాపులర్ నటుడు నటించి ఉంటే ఈ సినిమా ఫలితం మరింత బెటర్ గా ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అల్లు అర్హ ఈ సినిమాలో నటించినా అర్హ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది తప్ప అర్హ వల్ల ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తాయని చెప్పలేం.

సమంత ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఖుషి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఖుషి మూవీ ఈ ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందని సమంత అభిమానులు నమ్ముతున్నారు.

పవన్ భూమిక ఖుషి మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో శివ నిర్వాణ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus