టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురయ్యారు అయితే ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఈమె పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా చికిత్స కోసం కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది.
ఇకపోతే హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమంత సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈమె తన ప్రొడక్షన్ హౌస్ గురించి పలు విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫ్లవర్ బొకేతో ఉన్నటువంటి ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె ఫ్లవర్స్ గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వెల్లడించారు.
ఇలాంటివి చూసినప్పుడు మిక్స్‌డ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం వీటివల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. పువ్వులంటే ఎవరికి అలర్జీ అంటూ ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియాలో చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారడంతో పలువురు ఈ పోస్ట్ పై స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సమంతకు పువ్వులు అంటే అంత భయమా అసలు ఈమె పువ్వుల వల్లే ఆసుపత్రి పాలయ్యారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈమెకు పువ్వులు అంటే అలర్జీ ఉందనే విషయాన్ని ఇది వరకు పలు సందర్భాలలో కూడా తెలియజేసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా శాకుంతలం సినిమా షూటింగ్ సమయంలో సమంత (Samantha) పువ్వుల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!