Samantha: విజయం నీ హక్కు… సమంతను ఉక్కుతో పోల్చిన నటుడు!

  • December 26, 2022 / 06:37 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత గత కొద్దిరోజులుగా భయంకరమైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇలా సమంత ఈ వ్యాధి కారణంగా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఇకపోతే క్రిస్మస్ పండుగ సందర్భంగా నటుడు రాహుల్ రవీందర్ సమంతకు ఒక ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ పంపించారు. సమంతను ఉక్కుమనిషితో పోలుస్తూ రాహుల్ రవీందర్ ఒక శక్తివంతమైన మెసేజ్ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

అయితే ఇందులో ఉన్న ప్రతి ఒక్క పదం సమంత వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా ఉన్నాయి. ఇక రాహుల్ రవీందర్ పంపినటువంటి ఆ పోస్టుల్లో ఏముంది అనే విషయానికి వస్తే… ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు కానీ త్వరలోనే అది ప్రకాశిస్తుంది. ప్రస్తుతం మీ శరీరంలో కదలికలు కష్టంగా ఉండొచ్చు కానీ రేపు బాగుంటాయి.ఎందుకంటే నువ్వు ఉక్కు మహిళవి… విజయం నీ జన్మ హక్కు.. నువ్వు యోధురాలివి ఏది నిన్ను ఓడించలేదు ఇలాంటివి నిన్ను మరింత బలుపరుస్తాయి…

ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి అని రాసి ఉన్నటువంటి ఒక పోస్ట్ సమంతకు పంపించారు. ఇలా ఈయన చేసిన పోస్ట్ పై సమంత స్పందిస్తూ రాహుల్ రవీంద్రకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాహుల్ రవీందర్ పంపినటువంటి ఈ పోస్టుకు సమంత రిప్లై ఇస్తూ.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి అంకితం ఇస్తున్నాను. పోరాడుతూనే ఉండండి అప్పుడే గతంలో కంటే మరింత దృఢంగా తయారవుతారు అంటూ శ్యామ్ చెప్పుకొచ్చారు.

ఇలా ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితులలో రాహుల్ రవీందర్ తనకు ఎంతో మనోధైర్యాన్ని కల్పించే విధంగా పోస్ట్ పంపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాహుల్ రవీందర్ చిన్మయి, సమంత ముగ్గురు మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus