Samantha: అతనితో నా రిలేషన్‌కి పేరు పెట్టలేను: సమంత ఎమోషనల్ రియాక్షన్‌!

బంధాలు గురించి, అనుబంధాల గురించి సమంత (Samantha) తరచుగా ఏదో ఒక పోస్టు సోషల్‌ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఆది ఆమె బ్రోకెన్‌ రిలేషన్‌షిప్‌ గురించి కానీ, కొత్త స్నేహం గురించి కానీ, పాత ఫ్రెండ్స్‌ గురించి ఉంటూ ఉంటుంది. తాజాగా మరోసారి సమంత పేరు పెట్టలేని ఓ రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడింది. కోలీవుడ్‌లో ఇటీవల నిర్వహించిన గోల్డెన్‌ క్వీన్‌ పురస్కారాల్లో సమంత గోల్డెన్‌ క్వీన్‌గా అవార్డు తీసుకుంది. ఆ సందర్భంగానే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Samantha

కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆమె.. నటుడు,దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో  (Rahul Ravindran) తన అనుబంధాన్ని కూడా షేర్‌ చేసుకుంది. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్‌ రవీంద్రేనే తన వెంట ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు తనతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడని తెలిపింది. మా అనుబంధానికి పేరు పెట్టలేను అని కూడా అంది. అతను తన స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడా అని ప్రత్యేకంగా చెప్పలేను అని అంది.

ఇక తన అభిమానుల గురించి మాట్లాడుతూ నా జీవితంలో ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పింది. వారిని దేవుడిచ్చిన వరంగా భావిస్తాను అని కూడా చెప్పింది. తెలిసీ తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి అని సమంత చెప్పింది. ఆమె నేరుగా చెప్పకపోయినా ఆమె ఉద్దేశం ఏంటో అభిమానులు అర్థం చేసుకోవచ్చు.

అదే స్టేజీ మీద సమంత తన మనసులోని మరో మాటను కూడా బయటపెట్టింది. సమంతతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించానని, కానీ, కుదరలేదని ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర అన్నారు. అయితే ఎప్పటికైనా సమంతతో సినిమా తీస్తానని అన్నారు. ఆ మాటకు సమంత రియాక్ట్‌ అవుతూ యాక్షన్‌ ఫిల్మ్‌ చేయాలనుందని చెప్పారు. దీంతో కచ్చితంగా యాక్షన్‌ ఫిల్మ్ చేద్దామని సుధ చెప్పుకొచ్చారు. అంటే ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ఆశించొచ్చు.

మెగా హీరోతో డిజాస్టర్ వచ్చినా.. బాలీవుడ్ లో ఛాన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus