యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా టెక్నికల్ టీమ్ కూడా దాదాపుగా ఫైనల్ అయిందని బోగట్టా. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ పూర్తైన వెంటనే తారక్ తరువాత సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే ఎన్టీఆర్ సమంత కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సామ్ కలిసి నటించిన సినిమాలలో బృందావనం, జనతా గ్యారేజ్ హిట్లుగా నిలిస్తే రామయ్య వస్తావయ్యా, రభస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ కాంబినేషన్ లో మరో సినిమా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మొదట ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ, అలియా భట్, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి. ఈ హీరోయిన్లలో ఎవరో ఒకరు తారక్ కు జోడీగా ఫైనల్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా సమంత పేరు వినిపిస్తుండటంతో తారక్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా మరో హీరోయిన్ ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సమంతల జోడీని చాలాసార్లు చూశామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొరటాల శివ ఆచార్య సినిమా రిలీజైన తర్వాత ఎన్టీఆర్ సినిమా పనులతో బిజీ కానున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని బోగట్టా.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!