సమంతా కు బిడ్డ కావాలట…!

అందాల భామ సమాంత వరుస సినిమాలతో బిజీ..బిజీగా గడుపుతుంది. ఒక పక్క సినిమాలు, మరో పక్క కమర్షియల్ ఆడ్స్ తో దూసుకుపోతుంది సమంతా. ప్రస్తుతం ఈ భామ ఇటు తెలుగు, అటు తమిళాలో దాదాపుగా అరడజను సినిమాల వరకూ నటిస్తుంది. అందులో ధనుష్ హీరోగా ‘వడ చెన్నై’లో నటిస్తుండగా, సూర్య హీరోగా అటు తమిళ్, ఇటు తెలుగులో “24” అనే సినిమాను చేస్తుంది. ఇక తెలుగు విషయానికి వస్తే నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ దర్శకత్వంలో వస్తున్న ‘అ..ఆ’ సినిమాలో నటిస్తుండగా. మరో పక్క శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ తో కలసి మరోసారి ‘బ్రహ్మోత్సవం’లో ఆడి పాడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో సెట్ లో సమంతా మహేష్ కూతురు సీతారతో హల్‌చల్ చేసింది.

ఇక ఆ హల్‌చల్ మొత్తం సమంతా తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ఆమె బ్రహ్మోత్సవం సెట్ కు వచ్చిన ప్రిన్స్ కూతురితో ఆటలాడుకుంటూ ఉన్న సమయంలో ప్రిన్స్ డాటర్ సితార….ఈ వీకెండ్ మీ పాపను కూడా తీసుకుని రండి మేమంతా ఆడుకుంటాం అంటూ వచ్చి..రాని ముద్దు..ముద్దు మాటలతో సమంతకు షాక్ ఇచ్చింది. ఇక దే విషయాన్ని సమంతా స్వీట్ చేస్తూ….సీతారతో ప్లే డేట్ కు వెళ్ళాను…చాలా థ్రిల్ గా ఉంది, కానీ తాను ఈసారి వచ్చేటప్పుడు నా కూతురిని తీసుకురమ్మంది, ఈ శనివారం లోపు ఎలా అరేంజ్ చెయ్యాలో అర్ధం కావడంలేదు అంటూ నవ్వుతూ…కన్‌ఫ్యూసింగ్ స్మైలీ పెట్టింది. ఇక ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ అంతా…తమదైన శైలిలో ఈ జెస్సీ కి రెస్పాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus