కొద్దిరోజుల నుండి సమంత మరియు పూజ హెగ్డే మధ్య చిన్న వార్ నడుస్తుంది. దానికి కారణం పూజ హెగ్డెనే. సమంతను ఉద్దేశిస్తూ పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ నెగెటివ్ పోస్ట్ పెట్టింది.అది సమంత అందాన్ని కించపరిచేదిగా ఉంది. దానితో సమంత ఫ్యాన్స్ పూజను సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఐతే పూజ ఆ పోస్ట్ తో తనకు సంబంధం లేదు, ఆ పోస్ట్ నా ప్రమేయం లేకుండా జరిగింది, నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పింది.
నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి ఎవరో సమంతపై ఆ పోస్ట్ పెట్టారని, నా టీం సభ్యులు నా అకౌంట్ రికవరీ చేసేపనిలో ఉన్నారని చెప్పింది.ఐతే పూజ మాటలు సమంత ఫ్యాన్స్ తో పాటు సమంత కూడా నమ్మినట్లు లేదు. అందుకే తనదైన శైలిలో సైటర్లు వేస్తుంది. ఇక గత రాత్రి సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ”మంచి మనసులు కలిగిన వారిని ఎదుటివారు తెలివితక్కువ వారిగా జమేస్తారు” అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సమంత పూజ హెగ్డే ని ఉద్దేశించే చేసిందని కొందరు భావిస్తున్నారు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వీరి మధ్య ఓ సోషల్ మీడియా పోస్ట్ చిచ్చు రేపింది. మరి దీని వెనుక ఎవరున్నారు అనేది అర్థం కావడం లేదు. మరో ప్రక్క పూజ హెగ్డే అక్కినేని హీరో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో చేస్తుంది. అలాగే చైతూకి జంటగా ఓ లైలా కోసం మూవీలో హీరోయిన్ గా నటించింది.