Samantha: బాలీవుడ్‌లో సమంత మరో సినిమా ఓకే అయ్యిందట!

సమంత – బాలీవుడ్‌ సినిమా… ఈ టాపిక్‌ గురించి చాలా రోజుల నుండి మాట్లాడుతూనే ఉన్నాం. ఇదిగో సమంత బాలీవుడ్‌ సినిమా, అదిగో సమంత బాలీవుడ్ సినిమా అంటూ సినిమాల పేర్లు.. కాంబినేషన్‌ల గురించి వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏ విషయం గురించీ క్లారిటీ రాలేదు. అలా క్లారిటీ లేని సమంత సినిమాల లిస్ట్‌లో మరో సినిమా వచ్చి యాడ్‌ అయ్యింది. ఈసారి ఓ హీరోయిన్‌ను తప్పించి మరీ సమంతను తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఇక ఆమె బాలీవుడ్‌ ఎంట్రీనే బాకీ అని వార్తలొచ్చాయి. ఏవేవో సినిమా పేర్లు, హీరోల పేర్లు వినిపించాయి.. కానీ ఏ సినిమా కూడా పట్టాలెక్కలేదు. అయితే సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తానని తాప్సీ ఇటీవల వెల్లడించింది. ఆ లెక్కన హిందీలో సమంతకు అది తొలి సినిమా అవుతుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా దినేష్ విజయన్ నిర్మించనున్న మరో సినిమాలో సమంత నటిస్తోందని వార్తలొస్తున్నాయి.

ఆ లెక్కన సమంత రెండో బాలీవుడ్‌ సినిమా ఆయుష్మాన్‌ ఖురానాది అవుతుంది. విక్కీ కౌశల్ హీరోగా ‘ఉరి’ అనే సినిమా తెరకెక్కించిన ఆదిత్య ధర్ ఈ సినిమా చేస్తున్నారు. దీనికి ‘ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే సినిమా ప్లాన్ చేశారు. తొలుత ఈ సినిమాలో కథానాయికగా సారా అలీ ఖాన్ పేరు వినిపించింది. ఇప్పుడు ఆమెను తప్పించి సమంతను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే సమంతను దర్శకుడు ఆదిత్య ధర్ కథ చెప్పారని టాక్‌. మరి సమంత రెస్పాన్స్‌ ఏంటీ అనేది చూడాలి.

విడాకులు తర్వాత సమంత ఎక్కువగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తోంద. ‘శాకుంతలం’, ‘యశోద’ లాంటి కథలకు ఓకే చెప్పింది. దీంతో సమంత ఇటొచ్చేస్తోందా? అనే అనుమానం కలిగింది. అయితే విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ ఓకే చేసి కమర్షియల్‌ హీరోయిన్‌గా ఇంకా ఉన్నా అని చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అలాంటి కథల గురించే చూస్తోంది అని టాక్‌. అంతేకాదు త్వరలో ముంబయికి మకాం మార్చాలని సమంత ఆలోచిస్తోందట.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus