సమంత అంత తక్కువకి ఒప్పుకుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత పెళ్లి తరువాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడుపుతోంది. ఇక లేటెస్ట్ గా ‘ఆహా’ యాప్ లో ‘సామ్ జామ్’ అంటూ ఓ టాక్ షోని హోస్ట్ చేస్తోంది. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ని టాక్ షో కోసం తీసుకొచ్చారంటే రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో ఇచ్చి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ సమంత ఇప్పటివరకు తన కెరీర్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది ఈ షోకే అని సమాచారం. మొత్తం ఈ టాక్ షో కోసం సామ్ కి ఇచ్చిన తెలుసా..? జస్ట్ కోటిన్నర. అది కూడా మొత్తం పది ఎపిసోడ్ లకు కలిపి అని తెలుస్తోంది.

అంటే ఒక్కో ఎపిసోడ్ కి రూ.15 లక్షలు మాత్రమే. ఇంత తక్కువ రెమ్యునరేషన్ కి సమంత ఎందుకు ఒప్పుకుందనే ప్రశ్నలు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దానికి సమాధానం ఒక్కటే. అల్లు అరవింద్ కి నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉంది. హిట్ కోసం ఎదురుచూస్తోన్న సమయంలో నాగచైతన్యతో ఓ సినిమా తీశారు అల్లు అరవింద్. ఇప్పుడు అఖిల్ తో కూడా ఓ సినిమా తీస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అరవింద్ అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా సమంత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ టాక్ షోకి సంబంధించిన ఎపిసోడ్ ని ప్రసారం చేశారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ షో మెప్పించలేకపోయింది.

ఫస్ట్ షో కాబట్టి ఓ స్టార్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అతడితో ముచ్చటించింది సమంత. ఆ తరువాత ఓ మానసిక నిపుణుడ్ని, వైద్యుడ్ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. వెంటనే ఓ పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడించారు. మధ్యలో వైవా హర్షను రంగంలోకి దించారు. అసలు హర్ష ఎందుకొచ్చాడో, ఎందుకు వెళ్లాడో అర్ధం కాదు. అన్ని ఎమోషన్స్ ని ఈ షోలో చూపించాలని భావించి కిచిడీ చేసేసారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus