Samantha: విజయ్ దేవరకొండ కోసం సమంత?

నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత సమంత తన కెరీర్ విషయంలో మరింత ముందడుగు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చేసినా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. హీరోయిన్ గా ఆమె కెరీర్ చివరకు వచ్చేసిందని అనుకున్న సమయంలో సమంత డిఫరెంట్ రేంజ్ లో తన క్రేజ్ ను పెంచుకుంటోంది. గ్లామర్ డోస్ పెంచడమే కాకుండా వీలైనంత వరకు తనలోని నటిని బయటకు లాగుతోంది. ఇక బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తుండడంతో ఆమె మెల్లగా అటువైపు కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.

ఇటీవల పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసిన సామ్ పాన్ ఇండియా రేంజ్ లో అన్ని వర్గాల ఆడియేన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సమంత మరిన్ని ఐటెమ్ సాంగ్స్ చేసేందుకు సిద్ధంగా ఉందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండతో కూడా చిందులు వేయబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాలో కూడా స్పెషల్ ఐటెమ్ సాంగ్ ఉండబోతోంది. ఇక పుష్ప తరహాలోనే సమంతను తీసుకునే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తోంది. కానీ ఈ టాక్ ఎంతవరకు నిజం అదే తెలియదు. అయినా మళ్ళీ పుష్ప తరువాత మరో పాన్ ఇండియా సినిమాలో సమంత తోనే మరో ఐటెమ్ సాంగ్ అంటే లైగర్ యూనిట్ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఇక సమంత పుష్ప తరువాత మరొక ఐటెమ్ సాంగ్ కు ఒప్పుకున్నట్లు ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇక ప్రస్తుతం సమంత యశోద ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ద ఫ్యామిలీ మ్యాన్ దర్శకులతో కూడా ఆమె యాక్షన్ వెబ్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ఇప్పటికే శాకుంతలం ప్రాజెక్ట్ ను సమంత ఫినిష్ చేసింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus