Samantha Song: పుష్పలో ఐటెమ్ సాంగ్ బడ్జెట్ ఎంతంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మరో పాన్ ఇండియా మూవీ పుష్ప పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఇండస్ట్రీలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని అందరూ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో అయితే చిత్ర యూనిట్ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేదు అని అర్థమవుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దర్శకుడు సంగీత దర్శకుడు పాల్గొనకపోవడం పై కొంత అసంతృప్తి నెలకొంది.అయితే ఫైనల్ గా సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సంతోష పడతారు అని చెబుతున్నారు. ఇక అన్ని భాషల్లో అల్లు అర్జున్ తీరిక లేకుండా అవులోగా ప్రమోషన్ చేస్తున్నాడు ఇక సినిమాలో అన్నిటికంటే హైలెట్ గా సమంత ఐటెం సాంగ్ అని తెలుస్తోంది. అయితే ఈ పాట కోసం చిత్ర యూనిట్ సభ్యులు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

మొత్తంగా సెట్స్ తో పాటు సమంత రెమ్యునరేషన్ తో తో కలిపి ఐదు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఊ అంటారా ఉ ఉ అంటావా మావా.. అంటూ సమంత చేసిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియా భారీ స్థాయిలో ట్రెండ్ సెట్ చేస్తోంది. యూట్యూబ్ లో అయితే 40 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ పాట కూడా అత్యధిక వేగంగా ఈ స్థాయిలో వ్యూవ్స్ అందుకోలేదు.

తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ పాటకు మంచి క్రేజ్ దక్కింది. సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఈ పాటకు కూడా ప్రధానంగా హైలెట్ అవుతుందని చెబుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ పాట మామూలుగా ఉండదు అని చెప్పాడు. మొత్తానికి సమంత ఐటెమ్ సాంగ్ ద్వారా సినిమాకు మరికొంత బజ్ క్రియేట్ అయ్యింది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus