రిలీజ్ కి ముందే సీక్వెల్ ప్లాన్!

దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘జాంబీరెడ్డి’ సినిమా ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంకా థియేటర్లోకి రాక ముందే ఈ సినిమా యూనిట్ సీక్వెల్ గురించి మాట్లాడుతుంది. పైగా సీక్వెల్ లో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుందని చెబుతున్నారు. ఈ మాటని ‘జాంబీరెడ్డి’ సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జ చెబుతున్నాడు. ‘జాంబీరెడ్డి’ కథతో పాటు దానికి సీక్వెల్ ను కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ.

అంతేకాదు.. ‘జాంబీరెడ్డి’ సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందే సీక్వెల్ కథను సమంతకు వినిపించాడట దర్శకుడు. ‘జాంబీరెడ్డి’ విడుదలైన వెంటనే ప్రశాంత్ వర్మ.. సీక్వెల్ మొదలుపెడతాడని చెబుతున్నారు. నిజానికి దర్శకుడు ప్రశాంత్ వర్మకి ఇలా సీక్వెల్స్ ని ప్రకటించడం కొత్తేమీ కాదు. తను తెరకెక్కించిన మొదటి సినిమా ‘అ!’కు సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. అలానే ‘కల్కి’ సినిమాకి కూడా సీక్వెల్ తీస్తానని అన్నాడు. దానికి సంగతి ఇంకా తేలలేదు.

ఇప్పుడు ‘జాంబీరెడ్డి’ రిలీజ్ కాకముందే సీక్వెల్ ఉంటుందని.. ఆ సినిమాలో సమంత నటిస్తుందని చెబుతున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక ‘జాంబీరెడ్డి’ సినిమా జాంబీ కాన్సెప్ట్ తో తెరకెక్కించినప్పటికీ హారర్ ఎలిమెంట్స్ కంటే కామెడీ ఎక్కువగా ఉంటుందని సమాచారం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus