Samantha, Naga Chaitanya: చైతు విషయంలో సమంత మరో డెసిషన్!

బాలీవుడ్‌లో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా చేస్తున్నాడనో లేక రీసెంట్‌ వ్యక్తిగత విషయమో కానీ, నాగచైతన్య ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయిపోయాడు. అతని ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్లు దాటింది. దీంతో అతని అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఒక అన్‌ఫాలో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమంత.

Click Here To Watch NOW

అవును, సమంత – నాగచైతన్య విడిపోయి చాలా రోజులైంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు చూస్తే ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదు. చైతన్య ఇన్‌స్టా అకౌంట్‌ను సమంత అన్‌ఫాలో చేసేసింది. అయితే మిగిలిన అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబ హీరోలు, వ్య‌క్తుల అకౌంట్ల‌ను మాత్రం ఫాలో అవుతూనే ఉంది. నాగార్జున‌, రానా, అమ‌ల‌, అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌ను ఆమె అనుసరిస్తూనే ఉంది. అదే విధంగా నాగ‌చైత‌న్య కూడా స‌మంత ఇన్ స్టాగ్రామ్‌ను ఫాలో అవుతున్నాడు.

దీంతో ఈ అన్‌ఫాలో పెద్ద చర్చగా మారింది. సమంత అన్‌ఫాలో విషయం బయటకు రావడంతో… ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లు వచ్చారన్న ఆనందం అభిమానులకు ఎక్కువసేపు లేకుండా పోయింది. వివాహ బంధానికి స్వస్తి పలికినప్పుడే సోషల్‌ మీడియా బంధానికి సమంత స్వస్తి పలికి ఉంటే ఇంత చర్చ ఇప్పుడు ఉండేది కాదు. ఇన్నాళ్లూ ఊరుకొని ఇప్పుడు ఎందుకు అన్‌ఫాలో చేసింది అనేదే ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. అందులోనూ కేవలం నాగచైతన్య అకౌంట్‌ని మాత్రమే. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల ‘బంగార్రాజు’ సినిమాతో నాగ చైతన్య ప్రేక్షకులను పలకరించాడు.

త్వరలో విక్రమ్‌ కె. కుమార్‌ ‘థ్యాంక్యూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. మరోవైపు అమెజాన్ ప్రైమ్‌ కోసం ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌ కూడా చేస్తున్నాడు. దీనికి కూడా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. త్వరలో ఈ సిరిస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సమంత అయితే ‘శాకుంతలం’, ‘యశోధ’ సినిమాలు చేస్తోంది. విజయ్‌ దేవరకొండ – శివ నిర్వాణ సినిమా కూడా ఉందంటున్నారు. ఇవి కాకుండా తమిళంలో ‘రాంబో కణ్మణి ఖతీజా’ చేసింది. ఓ ఆంగ్ల సినిమా కూడా ఉంది. అలాగే బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌తో వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus