‘యశోద’ సినిమాకి ప్రభాస్ ఫ్యాన్స్ షాకివ్వబోతున్నారా!

ఈ మధ్య కాలంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది.పాత ప్రింట్ లను 4K కి అప్డేట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల ఆయా హీరోల అభిమానులకు పండుగలా ఉంటుంది. ఆల్రెడీ ‘పోకిరి’ ‘జల్సా’ ‘చెన్నకేశవరెడ్డి’ ‘బిల్లా’ వంటి చిత్రాలను రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ ‘వర్షం’ కూడా రీ రిలీజ్ కాబోతుంది.4K లో ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నవంబర్ 11న రీ రిలీజ్ చేయబోతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా, గోపీచంద్ విలన్ గా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆ టీంలో ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రాన్ని నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నట్టు వినికిడి.

అయితే అదే రోజున సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’ కూడా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుండడం.. సమంత సినిమా పై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్నింగ్ షోలు ‘వర్షం’ వల్ల సమంత ‘యశోద’ బుకింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

అయితే ‘యశోద’ పై సింపతీ కూడా ఏర్పడింది. సమంతకు ప్రాణాంతక హాని వైపించడంతో ఆమె పై అభిమానంతో కచ్చితంగా ‘యశోద’ చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. పైగా టీజర్, ట్రైలర్ వంటివి కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus