Samantha: కండల మండేలా లాగా.. కండల సమంత !

సమంత అందం, అభినయానికి యావత్ సౌత్ ఇండియా ఎప్పుడో ఫిదా అయింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ఇండియా కూడా సామ్ అంటే పడి చస్తోంది. అందుకే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటడెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హిందీ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇంతటి పాపులారిటీ సామ్ కు అంత ఈజీగా ఏం రాలేదు మరి. ప్రతి పాత్ర కోసం సమంత ఎంతో కష్టపడింది. ముఖ్యంగా తన అందం కోసం, ఫిట్ నెస్ కోసం సామ్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఫిట్ గా ఉంటడానికి సామ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కరెక్ట్ గా డైట్ పాటిస్తూ.. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటుంది. అయితే సాధారణంగా హీరోయిన్లంతా నార్మల్ గా కార్డియో లాంటి కసరత్తులు చేస్తే.. సమంత మాత్రం వెయిట్ లిఫ్టింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల బాడీకి స్టామినా వస్తుందని చెబుతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికే పలుమార్లు జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఫొటోలు పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

గతంలో ఏకంగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తింది. ఆ వీడియో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తరచూ తను జిమ్ లో కసరత్తు చేస్తూ ఫొటోలు పెడుతూ ఉంటుంది. మయోసైటిస్ తో బాధ పడుతున్నప్పుడు కూడా సామ్ తన ఫిట్ నెస్ ట్రైనింగ్ వదల్లేదు. ఇంకా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుని త్వరగా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంది. అయితే సమంత లేటెస్ట్ గా జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫొటో పంచుకుంది. ఈ ఫొటోలో సామ్ తన ట్రైనర్ తో కలిసి పోజులిచ్చింది.

తన కండలు చూపిస్తూ ఫొటో దిగింది. ఈ ఫొటోలో (Samantha) సామ్ కండలు చూస్తుంటే.. ఈ మాత్రం ఫిట్ నెస్ రావడానికి ఈ బ్యూటీ ఎంత కష్టపడిందో అర్థమవుతుంది. ప్రస్తుతం సామ్ లేటెస్ట్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి సామ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంత బిజీ షెడ్యూల్ లో కూడా జిమ్ చేస్తూ సామ్ ఇన్స్పైర్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. కండల మండేలా లాగా.. కండల సమంత అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus