Shaakuntalam: సమంతకు షాక్.. శాకుంతలం బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?

స్టార్ హీరోయిన్ సమంత, అల్లు అర్హ కీలక పాత్రల్లో నటించిన శాకుంతలం సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే శాకుంతలం సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. కొన్ని ప్రముఖ థియేటర్లలో మినహా మిగతా థియేటర్లలో శాకుంతలం సినిమాకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శాకుంతలం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

శాకుంతలం (Shaakuntalam) త్రీడీ బుకింగ్స్ సైతం ఇదే విధంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. శాకుంతలం బడ్జెట్ కు అనుగుణంగా కలెక్షన్లు రావాలంటే ఈ సినిమాకు బుకింగ్స్ మరింత ఎక్కువగా ఉండాలి. ఈ బుకింగ్స్ సమంతకు ఒకింత షాక్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఒక విధంగా సమంత మార్కెట్ ను డిసైడ్ చేయనుందని తెలుస్తోంది. మరోవైపు శాకుంతలం ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది.

మీడియాకు వేయాల్సిన శాకుంతలం ప్రీమియర్ షో కూడా రద్దైంది. అయితే మేకర్స్ మాత్రం సాంకేతిక సమస్య వల్ల ఈ సినిమా ప్రీమియర్ షో రద్దు చేయడం జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.. మరోవైపు సమంతకు ప్రస్తుతం నలతగా ఉందని వార్తలు వస్తున్నాయి. శాకుంతలం సినిమా సమంత కోరుకున్న విజయాన్ని అందిస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోయింది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పౌరాణిక బ్యాక్ డ్రాప్ లో మరికొన్ని సినిమాలు తెరకెక్కే అవకాశం ఉంది. ఈ తరహా సినిమాలలో నటించే అవకాశం వస్తే సమంత రాబోయే రోజుల్లో నటిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ మూవీ సక్సెస్ సాధిస్తే దేవ్ మోహన్ కు తెలుగులో ఆఫర్లు పెరిగే ఛాన్స్ ఉంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus