Shaakuntalam Trailer: శకుంతలగా ఆకట్టుకుంటున్న సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదిరింది..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన గుణ శేఖర్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు..

మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జును కుమార్తె చిన్నారి అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమవుతోంది.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో విడుదల కానున్న ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ చేశారు..ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా.. వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించేలా ఉంది.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాయనిపిస్తోంది..

‘ఈ భూమ్మీద అమ్మానాన్నాలకు అక్కర్లేని తొలిబిడ్డ.. మేనక, విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ పాప పుట్టింది.. అప్సరస బిడ్డైనా అనాథలా మిగిలిందే’ అంటూ ట్రైలర్ ద్వారా క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు.. ‘‘శకుంతల కారణజన్మురాలు.. ఒక నవనాగరిక చరిత్రకు నాంది పలుకబోతుంది.. స్వచ్ఛమైన తన ప్రేమకోసం దుర్వాసుల వారి ఆగ్రహానికి, కష్యప్ మహర్షుల వారి అనుగ్రహానికీ నడుమ ఆమె పడే కష్టాలు.. భూమాతకి సైతం భారమే’’ అంటూ కథ గురించి క్లారిటీగా చెప్పారు.. శకుంతలగా సమంత ఆకట్టుకోగా..

దుష్యంత మహారాజుగా, శకుంతలను మోసం చేసే పాత్రలో దేవ్ మోహన్ కనిపించాడు.. సమంత పూర్తిస్థాయిలో డబ్బింగ్ చెప్పడమే కాక డైలాగులు చక్కగా పలికింది.. ఇక ట్రైలర్ చివర్లో పులిపై కూర్చున్న చిన్ననాటి శకుంతలగా అల్లు అర్హ ముద్దులొలికిస్తూ కనిపించి అలరించింది.. మణిశర్మ మరోసారి తన మ్యూజిక్‌తో మాయ చేయనున్నారనిపిస్తోంది.. ఇతర పాత్రల్లో నటీనటులందర్నీ పరిచయం చేశారు.. ‘శాకుంతలం’ పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులను అలరిస్తుందని మూవీ టీం కాన్ఫిడెంట్‌గా ఉంది.. ‘యశోద’ తర్వాత సామ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ఇది..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus